: గంగమ్మ ఉగ్రరూపం... రిషికేశ్ లో భయంభయం!
గతకొన్ని రోజులుగా ఉత్తరభారతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గంగానది పోటెత్తుతోంది. దీంతో, ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ పుణ్యక్షేత్రంలో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. రైవాలా, థానో, రామ్ నగర్, దాండా ప్రాంతాల్లో వరద సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది చార్ దామ్ యాత్ర సందర్భంగా ఉత్తరాఖండ్ లో సంభవించిన వరదలు వేలాది మంది భక్తుల ప్రాణాలను హరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.