: పోలవరం పూర్తికావాలంటే... మరో 4 తెలంగాణ గ్రామాలు కావాలి: టీడీపీ


కొన్ని లక్షల ఎకరాలకు సాగు నీరు, అనేక పట్టణాలకు తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న మరో నాలుగు గ్రామాలు కావాలని టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, జయదేవ్, అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఏపీకి ఇచ్చిన 7 ముంపు మండలాలే కాకుండా మరో నాలుగు గ్రామాలను కేటాయిస్తే పోలవరం ప్రాజెక్టు ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తవుతుందని వీరు చెప్పారు. భద్రాచలం డివిజన్లో భద్రాచలం మినహా అన్ని ప్రాంతాలను ఏపీకి కేటాయిస్తామని గతంలో చెప్పారని... కానీ, నాలుగు గ్రామాలను (400 ఎకరాల పరిధి) మరచిపోయారని అన్నారు. ఇప్పుడు ఈ గ్రామాలను కూడా బిల్లులో చేర్చి, ఏపీకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News