: సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్ లోకి అడుగిడిన రైల్వేశాఖ
భారత రైల్వే శాఖ సోషల్ మీడియాలో అధికారికంగా అకౌంట్ ను తెరచింది. రైల్వేశాఖకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ఇవాళ ప్రారంభించారు. మంగళవారం నాడు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సమాచారాన్ని మరింత వేగంగా ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో ఖాతాను తెరచినట్లు ఆయన చెప్పారు. బడ్జెట్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు.