: హైదరాబాదులో భారీ వర్షం
హైదరాబాదులో భారీ వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, జీడిమెట్ల, అమీర్ పేట, పంజాగుట్ట, శంషాబాదు సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండగా ఉన్నా, సాయంత్రం వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. రోడ్లు జలమయమవ్వడంతో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.