: హెచ్ఐవీకి ఇది చికిత్స కాదుగానీ కాస్త బెటర్
ఇప్పటికీ చికిత్స లేని వ్యాధుల్లో హెచ్ఐవీ ఒకటి. ఇప్పటికీ చికిత్స కనుక్కోలేదు గానీ.. మెరుగ్గా నివారించడానికి ఓ మార్గం కనుగొన్నారు. ఇమ్యునిటీ సిస్టంలో కీలకమైన ఒక ప్రొటీన్ తాత్కాలికంగా నిలిపేస్తే.. హెచ్ఐవీ, హెపటైటిస్ సీ వంటి వ్యాధులను అరికట్టవచ్చునట. ఈ పరిశోధనను కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. వ్యాధులుసోకే సమయంలో ఇమ్యునిటీ సిస్టంలో విడుదల అయ్యే ఐఎఫ్ఎస్ 1 అనే ప్రొటీన్‌ను వారు గుర్తించారు. హెచ్ఐవీ వంటివి సోకినప్పుడు.. ఈ ఐఎఫ్ఎస్1 నుంచే నిరంతరం సంకేతాలు వస్తుంటాయి. అలాంటి సమయంలో దీనినే నియంత్రిస్తే గనుక.. ఇమ్యునిటీ ఎలా ఉంటుందా? అని వారు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఇమ్యునిటీ మరింత బాగా పనిచేసిందిట. దాంతో మనుషుల్లో ఈ తరహా చికిత్స పద్ధతిని ఎలా వాడుకోవాలనే విషయమై పరిశోధనలు సాగిస్తున్నారు.