: తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలసిన అనిల్ అంబానీ
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. హైదరాబాదులో తమ పెట్టుబడుల ప్రతిపాదనను అనిల్ అంబానీ సీఎంకు చెప్పినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎం ప్రధాన కార్యదర్శి నర్సింగరావు కూడా పాల్గొన్నారు.