: టీమిండియా ఎదుట సదవకాశం


ప్రస్తుతం ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న టీమిండియా ఎదుట ఓ సదవకాశం నిలిచింది. ఐదు టెస్టుల సిరీస్ లో గనుక ఇంగ్లండ్ ను ఓడిస్తే ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా మూడోస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ ర్యాంకుల జాబితాలో 102 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉంది. ఇంగ్లండ్ 100 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. కాగా, ఇంగ్లండ్ గనుక ఈ సిరీస్ ను 4-0తో నెగ్గితో మాత్రం భారత్ ఏడోస్థానానికి పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఐసీసీ ర్యాంకుల జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల ఖాతాలో సరిగ్గా 123 పాయింట్లు ఉన్నా, దశాంశాల తేడాతో ఆసీస్ నెంబర్ వన్ పీఠాన్ని అధిష్ఠించారు. ఇక, బ్యాట్స్ మెన్ ర్యాంకుల విషయానికొస్తే... ప్రస్తుతం ఏడోస్థానంలో ఉన్న టీమిండియా బ్యాటింగ్ సంచలనం ఛటేశ్వర్ పుజారా ఇంగ్లండ్ గడ్డపై పరుగుల వర్షం కురిపిస్తే, టాప్ ఫైవ్ లోకి దూసుకెళ్ళే చాన్సులున్నాయి. బౌలర్ల విషయానికొస్తే అశ్విన్ ఏడోస్థానంలో ఉన్నాడు. అయితే, పేస్ కు అనుకూలించే పిచ్ లపై అతడు రాణించే అవకాశాలు తక్కువే కాబట్టి, ర్యాంకుల్లో పురోగతి ఆశించలేం.

  • Loading...

More Telugu News