: భావప్రకటనా హక్కును టీ ప్రభుత్వం హరిస్తోంది: డాక్టర్ లక్ష్మణ్
రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా హక్కును కేసీఆర్ ప్రభుత్వం హరించివేస్తోందని తెలంగాణలో బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. ఎంఎస్ఓలను ఉపయోగించుకుని మీడియాపై ప్రత్యక్ష దాడికి పాల్పడటం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. వెంటనే తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోజు హైదరాబాదులో జర్నలిస్టులు నిర్వహించిన భారీ ర్యాలీకి హాజరైన లక్ష్మణ్... అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.