: నెల్లూరు జిల్లాలో తల్లిని నరికి చంపిన తనయుడు
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాపూరు మండలం కోటూరుపాడులో ఓ వ్యక్తి ఆస్తి వ్యవహారంలో కన్నతల్లినే కడతేర్చాడు. ఆస్తి పంపకాల్లో చిన్న కొడుక్కే సహకరిస్తున్నారని ఎం.నారాయణ అనే వ్యక్తి తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి రమణమ్మ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచింది. తండ్రిని ఆసుపత్రికి తరలించారు.