: అవుకు, సత్తెనపల్లిలో జోరున వాన... కర్నూలు, కారంచేడులో కుండపోత
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. వాన కోసం ఆకాశం కేసి చూసిన అన్నదాత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా అవుకులో 11 సెం.మీ, సత్తెనపల్లిలో 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలులో 8, కారంచేడులో 7, నర్సరావుపేట, తెనాలిలో 6, అవనిగడ్డ, వెలిగొండ్ల, బాపట్ల, ముద్దనూరుల్లో 5, విజయవాడ, ఒంగోలు, మంత్రాలయం, మర్రిపూడి, జంగమేశ్వరపురం, చీమకుర్తిలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. జమ్మలమడుగు, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో 2 సెం.మీ. వర్షపాతం రికార్డు అయింది. హైదరాబాదులో అత్యల్పంగా ఒక సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.