: లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న సభ్యులు రెండోసారి వాయిదా అనంతరం ప్రారంభమైన సభలోనూ అదే డిమాండ్ చేశారు. ఇందుకు సమాధానమిచ్చిన మంత్రి వెంకయ్యనాయుడు, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, ఓటింగ్ లేకుండా ధరల పెరుగుదలపై చర్చ చేపట్టవద్దని విపక్షాలు ఆందోళన చేశాయి. అటు సమావేశాలు కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. అయినా, సభ్యులు వినకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి.