: వీధి దీపాల ఏర్పాటుకు రూ.500 కోట్లు
ఇక నుంచి వీధి దీపాలకు ఎల్ ఈడీ వెలుగులు తోడవ్వనున్నాయి. స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. 24 మున్సిపాలిటీల్లోని 5 లక్షల వీధి దీపాలను ఎల్ ఈడీలుగా మారుస్తామని వారు వెల్లడించారు. హైదరాబాదులోని విద్యుత్ సౌధలో సౌరభ్ కుమార్ కమిటీ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా విద్యుత్ పొదుపు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అందులో భాగంగా స్ట్రీట్ లైట్లకు ఎల్ ఈడీలు అమర్చాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయ పంపు సెట్లను ఐఎస్ఐ పంపులతో ఉచితంగా మార్పు చేయాలని సౌరభ్ కుమార్ కమిటీ అభిప్రాయపడింది. విద్యుత్ వృథాను తగ్గించి, పొదుపును పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అజయ్ జైన్ చెప్పారు.