: బెజవాడ కనకదుర్గమ్మకు హైదరాబాదు బోనాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారికి హైదరాబాదు పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఆదివారం నాడు బోనాలు సమర్పించారు. 250 మంది విచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలతో పసుపు, కుంకుమ, పండ్లు, పట్టుచీర, పూజా ద్రవ్యాలతో ఉత్సవమూర్తి దుర్గమ్మను హైదరాబాదు నుంచి ఇంద్రకీలాద్రిపై నున్న దుర్గగుడికి తీసుకువచ్చారు. వీరికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.