: పెరిగాయని గొంతు చించుకోకండి... ప్రయోజనాలు మీరే చూస్తారు: నఖ్వీ
ధరలు పెరిగాయని ప్రతిపక్షాలు అనవసరంగా గొంతు చించుకోవడం మానాలని బీజేపీ అధికార ప్రతినిధి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సూచించారు. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరల పెరుగుదల ప్రయోజనాలు త్వరలోనే చూస్తారని అన్నారు. గత పదేళ్లలో దేశంలో పేదరికం రూపుమాపేశామని యూపీఏ ప్రభుత్వం చెప్పింది. అలా పేదరికాన్ని రూపుమాపేస్తే... ధరలు పెరిగాయని గొంతు చించుకోవడమెందుకని ఆయన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.
అంటే పేదరికం అలానే ఉందని వారే ఒప్పుకుంటున్నారని ఆయన సూచించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ధరలు పెంచామని ఆయన చెప్పుకొచ్చారు. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఎన్డీయే ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.