: దాడులకు మేం వ్యతిరేకం: తెలుగు టీవీ పరిరక్షణ సమితి


దాడులకు పాల్పడడం, హింసాత్మక చర్యలకు దిగడానికి తాము పూర్తి వ్యతిరేకమని తెలుగు టీవీ పరిరక్షణ సమితి నేతలు అంటున్నారు. డబ్బింగ్ సీరియళ్ళ ప్రసారం ఆపేందుకు ఉగాదిని గడువుగా విధించిన టీవీ ఆర్టిస్టులు.. ప్రసారం ఆపకపోవడంతో మాటీవీ కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ఓ టీవీ గేమ్ షోను అడ్డుకుని షూటింగ్ సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు టీవీ పరిరక్షణ సమితి నేతలు నాగబాల సురేష్, ప్రసాదరావు స్పందించారు.

దాడితో తమకు సంబంధం లేదని తెలిపారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మలిచేందుకు ఎవరైనా ప్రయత్నించి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. అనువాద ధారావాహికలతో కళాకారులను వీధిన పడేయడమే కాకుండా, భాషపైనా సాంస్కృతిక దాడికి పాల్పడతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News