: నేడు కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం... పాలనా విధానం ఖరారు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాష్ట్ర మంత్రులు, అత్యున్నత అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాదులోని ఎంసీహెచ్ఆర్డీలో జరిగే ఈ భేటీలో పాలనా విధానాన్ని కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరవుతారు. శాంతి భద్రతలు, వైద్యరంగం, సచివాలయ ఉన్నతాధికారుల నుంచి మండల స్థాయి అధికారులు, రైతు రుణమాఫీ, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ప్రభుత్వ భూముల ఆక్రమణ తదితర పలు అంశాలపై అధికారులతో కేసీఆర్ చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News