: ఓ వ్యక్తిని బలిగొన్న మంత్రి ఎస్కార్ట్ వాహనం


ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఎస్కార్ట్ వాహనం ఓ వ్యక్తిని బలిగొన్నది. వివరాల్లోకెళితే... మంత్రికి విజయవాడ వరకు ఎస్కార్ట్ వెళ్ళిన ఓ వాహనం తిరిగి వచ్చే క్రమంలో మచిలీపట్నం చల్లరాస్తా వద్ద అదుపు తప్పింది. జనాలపైకి దూసుకెళ్ళి, ఆనక, బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో స్థానికంగా ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్ళకూ గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News