: జర్నలిస్టుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం: టీ హోంమంత్రి నాయిని


తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని చెప్పారు. కనీస వేతన చట్టాన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు. జర్నలిస్టు చనిపోతే... వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా, పెన్షన్ పథకాన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా మహాసభలకు హాజరైన నాయిని ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News