: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి మోడీ ఘననివాళి
భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ, దేశానికి ముఖర్జీ చేసిన సేవలు 'అమూల్యం' అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, బీజేపీ సీనియర్ నేత అద్వానీ తదితరులు కూడా పాల్గొని ముఖర్జీకి నివాళులర్పించారు.