: మహేశ్ బాబుపై కేసు నమోదు


మద్యం ప్రచారం చిత్రంలో నటించిన టాలీవుడ్ హీరో మహేశ్ బాబుపై నల్గొండ జిల్లాలో కేసు నమోదైంది. తెల్లపల్లి గ్రామానికి చెందిన తూము సతీష్ కుమార్ అనే వ్యక్తి తాను మహేశ్ బాబు నటించిన వాణిజ్య ప్రకటన చూసి మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను అనారోగ్యానికి గురై ఇంటర్వ్యూకి హాజరుకాలేకపోవడానికి ఆ ప్రచారచిత్రమే కారణమని సతీష్ ఆరోపించాడు.

మహేశ్ నటించిన ఆ వాణిజ్య ప్రకటనలో ఆరోగ్యానికి హానికరం అన్న నినాదం లేదంటూ.. రాయల్ స్టాగ్ యజమాని, డిస్ట్రిబ్యూటర్ లతోపాటు మహేశ్ బాబుపైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై నల్గొండ జిల్లా నడిగూడెం ఎస్సై భిక్షపతి మాట్లాడుతూ, ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News