: షెడ్లు వేసుకునైనా సరే... సీమాంధ్ర నుంచే పరిపాలించుకుందాం: కావూరి


రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో, హైదరాబాదు నుంచి పరిపాలించడం సరైంది కాదని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. పక్కా భవనాలు లేకపోయినా... తాత్కాలికంగా షెడ్లు వేసైనా సరే సీమాంధ్ర నుంచే పరిపాలన కొనసాగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయాన్ని వెంటనే తేల్చేయాలని కోరారు. ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News