: రాజీనామా చేయని వారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి మాణిక్యాలరావు


నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు రాజీనామా చేయాలని గతంలోనే కోరామని... ఈ నేపథ్యంలో, రాజీనామా చేయకుండా పదవులను పట్టుకుని వేలాడుతున్న వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు హెచ్చరించారు. త్వరలోనే దేవాదాయ శాఖ ద్వారా ప్రతి జిల్లాలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News