: తమిళనాట మరో ప్రమాదం బారినపడ్డ తెలుగువారు
తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా ఉపరపలయం వద్ద ఓ గోడ కూలిన ప్రమాదంలో 11 మంది తెలుగువారు దుర్మరణం పాలయ్యారు. వర్షం కారణంగా ఓ గోడౌన్ గోడ కూలడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతులను తెలుగువారిగా గుర్తించారు. కార్మికులు గోడౌన్ గోడ ఆసరాగా గుడిసెలు వేసుకున్నారు. సరిగ్గా ఆ గుడిసెలపైనే గోడ కూలడంతో ప్రాణనష్టం సంభవించింది. కాగా, శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు భావిస్తున్నారు. కొన్ని రోజుల కిందటే చెన్నైలో పదకొండు అంతస్తుల భవనం కుప్పకూలి పలువురు తెలుగువారు మరణించిన సంగతి తెలిసిందే.