: యువీ సెంచరీ...రెస్టాఫ్ ది వరల్డ్ 293/7


రెస్టాఫ్ ది వరల్డ్, మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచిన రెస్టాఫ్ ద వరల్డ్ జట్టు సారధి షేన్ వార్న్ బ్యాటింగ్ ఎంచుకోగా, ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్లుగా కితాబులందుకున్న వీరేంద్ర సెహ్వాగ్ (22), గిల్ క్రిస్ట్ (29) శుభారంభం అందించారు. ధాటిగా ఆడుతున్న గిల్ క్రిస్ట్ ను సయీద్ అజ్మల్ పెవిలియన్ బాట పట్టించగా, బ్రెట్ లీ సెహ్వాగ్ ను బోల్తా కొట్టించాడు.
అదే జోరు కొనసాగించిన అజ్మల్ బంగ్లా బ్యాట్స్ మన్ తమీమ్ ఇక్బాల్, ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ ను వెంటవెంటనే పెవిలియన్ కు పంపాడు. దీంతో కేవలం 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన రెస్టాఫ్ ద వరల్డ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజులోకి వచ్చిన డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించి, వీరవిహారం చేశాడు. ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సులతో 132 పరుగులు చేశాడు.
సచిన్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టిన యువీ అదే ఊపులో మరో సిక్సర్ కొట్టబోయి రేన్ షో చేతికి చిక్కాడు. పీటర్ సిడిల్ (33), పాల్ కాలింగ్ వుడ్ (40) రాణించడంతో రెస్టాఫ్ ది వరల్డ్ ఏడు వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. సయీద్ అజ్మల్ నాలుగు వికెట్లు తీసి రాణించగా, బ్రెట్ లీ రెండు వికెట్లు తీసి చక్కని సహకారం అందించాడు. 294 పరుగుల విజయ లక్ష్యంతో సచిన్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.

  • Loading...

More Telugu News