: ప్రకాశం, నెల్లూరు జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా
ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. జడ్పీ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ప్రకటించారు. అలాగే, నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో జెడ్పీ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.