: మాటీవీ కార్యాలయాన్ని పరిశీలించిన అల్లు అరవింద్


టీవీ ఆర్టిస్టుల దాడికి గురైన మాటీవీ కార్యాలయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పరిశీలించారు. డబ్బింగ్ సీరియళ్ళు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు టీవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీవీ నటులు ఈరోజు సాయంత్రం హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మాటీవీ కార్యాలయంపై రాళ్ళతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పలు కార్లు, ఆఫీసు ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. దాడి సమాచారం అందుకున్న అల్లు అరవింద్ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అరవింద్ మాటీవీ డైరక్టర్లలో ఒకరన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News