: అతనికి కేసీఆరే దేవుడు!


అవును, అతనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే దేవుడు! కేసీఆర్ ఫొటోను దేవుడి పటాల దగ్గర పెట్టి నిత్యం పూజలు నిర్వహిస్తుంటాడు. వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్న పేట గ్రామానికి చెందిన సతీష్ యాదవ్ ఓ ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ ను అమితంగా అభిమానిస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో అతని అభిమానం అమాంతం పెరిగింది. కేసీఆర్ పట్టుదల, దీక్ష, పోరాటంతోనే తెలంగాణ కల సాకారమయిందని సతీష్ భావించాడు. దీంతో, తన షాపులో ఏకంగా కేసీఆర్ ఫొటో పెట్టుకుని పూజిస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News