: దేశ ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉంది: నిర్మలా సీతారామన్
దేశ ఆర్థికవ్యవస్థపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉందని పేర్కొన్నారు. దేశాభివృద్ధికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలని ఆమె సూచించారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా చూడలేమని చెప్పారు. రుణమాఫీ వంటి పథకాలపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేనన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు.