: తనను పెళ్లి చేసుకోమన్న మహిళా క్రికెటర్ తో కోహ్లీ ఫోజులు


'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో' అంటూ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ ట్విట్టర్ లో ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె పోస్టులు చిన్నపాటి సంచలనం రేపాయి కూడా. అయితే, ఈ నెల ఒకటి నుంచి 3వ తేదీ వరకు ఇంగ్లండ్ లోని డెర్బీషైర్ లో మూడు రోజుల మ్యాచ్ జరిగింది. అందులో భారతే గెలిచింది. ఆ సమయంలోనే అంటే 2వ తేదీన వ్యాట్, ఆమె సోదరుడు మ్యాక్స్ వ్యాట్ కోహ్లీని కలిశారు. ఈ సందర్భంగా వారితో విరాట్ కాసేపు ముచ్చటించి, ఫోటోలకు ఫోజిచ్చాడు. వెంటనే మ్యాక్స్ ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News