: లంక టైగర్ల కోసం మలేసియాలో వేట
శ్రీలంకలో సైనికచర్య అనంతరం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) సభ్యులు పెద్ద ఎత్తున హతమవగా, మిగిలిన కొందరు తూర్పు ఆసియా దేశాలకు పరారయ్యారు. ప్రస్తుతం వీరికోసం మలేసియాలో పెద్ద ఎత్తున వేట కొనసాగుతోంది. గత రెండు నెలల్లో ఏడుగురు మిలిటెంట్లను మలేసియా బలగాలు అరెస్టు చేశాయి. వీరిలో నలుగురిని గత గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిలో ఒకరు 1999లో అప్పటి అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగపై హత్యాయత్నం కేసులో నిందితుడు.
మలేసియాను స్థావరంగా చేసుకుని తమిళ ఈలం ఉద్యమానికి తిరిగి ఊపిర్లూదేందుకు టైగర్లు ప్రయత్నిస్తున్నారని మలేసియా పోలీసులు అంటున్నారు. ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు.