: కారు డోర్లు లాకైపోయి బాలుడి మృతి


మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో దారుణం జరిగిపోయింది. కారు డోర్లు లాకైపోవడంతో రెండున్నరేళ్ల బాలుడు మృతిచెందాడు. భోపాల్ లోని న్యూమార్కెట్ ప్రాంతంలో ఓ వస్త్ర వ్యాపారి కుమారుడు అతిశయజైన్ అనే బాలుడు ఎవరికీ తెలియకుండా కారుతాళాలు తీసుకుని కార్లో ఆడుకునేందుకు వెళ్లాడు. ఇంతలో కారు డోర్లు లాకైపోయాయి. అద్దాలు కూడా మూసి ఉండడంతో ఊపిరాడక బాలుడు మృతిచెందాడు. పిల్లాడెక్కడున్నాడని బాలుడి తల్లిదండ్రులు వెతగ్గా కారులో విగత జీవిగా కనిపించాడు. దీంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News