: ఏపీ... మహిళల పాలిట యమకూపం!
మహిళలపై నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ (విభజనకు పూర్వ రాష్ట్రం) ముందంజలో ఉన్నట్టు జాతీయ నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2013 ఏడాదికిగాను ఏపీలో మహిళలపై అత్యధిక సంఖ్యలో నేరాలు నమోదయ్యాయి. ఏపీ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
గతేడాది మహిళలపై అత్యధిక క్రైమ్ రేటు నమోదైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఈసారి మూడోస్థానంలో నిలిచింది. ఇక, 8 ఈశాన్య రాష్ట్రాల్లో ఆరింటిలో మహిళలపై నేరాలు పెచ్చరిల్లాయి. వీటిలో అసోం అగ్రగామిగా నిలిచింది.