: రూ.లక్ష కోట్లతో బలహీన వర్గాల అభివృద్ధి కార్యక్రమాలు: టి.రాజయ్య


బలహీన వర్గాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజయ్య వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఏజెన్సీలో విషజర్వాలు, అంటువ్యాధులు ప్రబలకుండా శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News