: గ్యాస్ సబ్సిడీ-ఆధార్ గడువు పొడిగించిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వంటగ్యాస్ సబ్సిడీకి 'ఆధార్ అనుసంధానం, సబ్సిడీ నగదు బదిలీ' వ్యవహారంలో గడువును రెండు నెలల పాటు పెంచినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
మన రాష్ట్రంలో ఇంకా అందరికీ ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కానందున, గడువును పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. గడువు పెంపకంకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.