: ఎన్నికలు కర్ణాటకలో... ఎన్నికల నియమావళి మన రాష్ట్రంలో!
కర్ణాటక అసెంబ్లీకి మే 5న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని మనరాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమలు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ సచివాలయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ చిత్తూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేటినుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రెండు రాష్ట్రాలలోనూ ఓటు హక్కు ఉన్న వారిని జాబితా నుంచి తొలగించనున్నట్లు చెప్పారు. అంతేకాక, కర్ణాటక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు సంబంధించి మన రాష్ట్రంలో ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.