: ఇరాక్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన 46 మంది నర్సులు, 137 మంది ఇతరులు
ఇరాక్ లో 46 మంది నర్సులను ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన వ్యవహారం దేశం మొత్తాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే, వారందరినీ మిలిటెంట్లు విడిచి పెట్టడంతో, ఇరాక్ నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో మన దేశానికి చేరుకున్నారు. వారితో పాటు మరో 137 మంది భారతీయులు కూడా క్షేమంగా తిరిగొచ్చారు. భారత్ చేరుకున్న వారిలో 100 మంది తెలుగువారు కూడా ఉన్నారు. వీరి రాకతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.