: లార్డ్స్ లో నేడు 'సచిన్ వర్సెస్ షేన్ వార్న్'


ప్రపంచ ప్రసిద్ధిపొందిన లార్డ్స్ మైదానం రెండు వందల ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంగ్లండ్ లోని ఈ చారిత్రక మైదానంలో నేడు ఎంసీసీ, వరల్డ్ ఎలెవన్ జట్లు గౌరవపూర్వక మ్యాచ్ ఆడనున్నాయి. వీటిలో ఎంసీసీ జట్టుకు బ్యాటింగ్ గాడ్ సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తుండగా, వరల్డ్ జట్టుకు విఖ్యాత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ సారథిగా వ్యవహరిస్తాడు. సచిన్ అమ్ములపొదిలో బ్యాటింగ్ రారాజు బ్రియాన్ లారా, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ఇక, వార్న్ కు స్పిన్ అస్త్రం ముత్తయ్య మురళీధరన్, డాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్, గిల్ క్రిస్ట్, కెవిన్ పీటర్సన్, యువరాజ్ సింగ్ అండగా నిలవనున్నాడు.
నేడు జరిగే ఈ మ్యాచ్ లో పాల్గొనే జట్లలోని సభ్యులు వీరే...
ఎంసీసీ...
సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), ద్రావిడ్, చందర్ పాల్, లారా, ఫించ్, క్రిస్ రీడ్ (వికెట్ కీపర్), బ్రెట్ లీ, షాన్ టెయిట్, అజ్మల్, ఉమర్ గుల్, వెటోరీ.
వరల్డ్ ఎలెవన్...
షేన్ వార్న్ (కెప్టెన్), సెహ్వాగ్, గిల్ క్రిస్ట్ (వికెట్ కీపర్), యువరాజ్ సింగ్, కెవిన్ పీటర్సన్, అఫ్రిది, తమీమ్ ఇక్బాల్, కాలింగ్ వుడ్, టినో బెస్ట్, మురళీధరన్, పీటర్ సిడిల్.

  • Loading...

More Telugu News