: ఉద్యోగుల విభజనపై నేడు వెలువడనున్న ముసాయిదా మార్గదర్శకాలు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన అంశం క్లిష్టంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఉద్యోగుల విభజనపై ముసాయిదా మార్గదర్శకాలు వెలువడనున్నాయి. మార్గదర్శకాలు నిన్ననే వెలువడాల్సి ఉన్నప్పటికీ... తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డిల సంతకాలు కాకపోవడంతో ఒక రోజు ఆలస్యం అయింది. అయితే, రానున్న రెండేళ్లలో పదవీ విరమణ పొందనున్న వారికి విభజన నుంచి మినహాయింపు ఇవ్వాలన్న నిర్ణయం వివాదాస్పదం కానుంది. ఏపీలో రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచడమే దీనికి కారణం. దీనికి సంబంధించి మార్గదర్శకాల్లో ఎలాంటి సూత్రీకరణలు చేశారనేది టెన్షన్ క్రియేట్ చేస్తోంది.