: విశాఖలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 117వ జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా పాండ్రంగిలో ఈ వేడుకలకు ప్రభుత్వం తరపున మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.