: సుప్రీంకోర్టులో కేసులున్నందునే అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు: అశోక్ బాబు


తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని, రెవెన్యూ కార్యదర్శిని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని గోపన్నపల్లిలో ఏపీఎన్జీవోలకు గతంలో కేటాయించిన 189 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్ మెంట్ స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. తెలంగాణ డిప్యూటీ సీఎం అలీని కలిసిన అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ... సుప్రీంకోర్టులో కేసులున్నందున ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News