: వైఎస్సార్సీపీ నేతల కళ్లలో కారం చల్లిన టీడీపీ కౌన్సిలర్లు
ఫ్యాక్షన్ తగాదాల తరహాలో కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం పోలీసులపై రాళ్లు రువ్విన టీడీపీ కార్యకర్తలు, మధ్యాహ్నం మరింత రెచ్చిపోయారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలను పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ అవినాష్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టీడీపీ మహిళా నేతలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల కళ్ళల్లో కారం చల్లారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి తరలించారు.