: మాటీవీ కార్యాలయంపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం


డబ్బింగ్ సీరియళ్ళ వివాదం తీవ్రరూపం దాల్చింది. అనువాద ధారావాహికలు తమ పొట్టగొడుతున్నాయంటూ, వాటిని ఆపకపోతే ఆందోళన తీవ్రతరమవుతందని హెచ్చిరించిన తెలుగు టీవీ పరిరక్షణ సమితి అన్నంతపనీ చేసింది. డబ్బింగ్ సీరియళ్ళ ప్రసారం ఆపేందుకు ససేమిరా అంటోన్న మాటీవీ కార్యాలయంపై నేడు తెలుగు టీవీ కళాకారులు దాడికి పాల్పడ్డారు. పరభాషా సీరియళ్ళు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మాటీవీ కార్యాలయంలోని కార్లు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

అనువాద ధారావాహికలు నిలిపివేయాలంటూ ఇటీవలే తెలుగు టీవీ నటులు చేసిన విన్నపానికి కొన్ని చానళ్ళు స్పందించి డబ్బింగ్ సీరియళ్ళు నిలిపివేశాయి. అయితే మాటీవీ యాజమాన్యం మాత్రం తన వైఖరి మార్చుకోకపోవడం ఆర్టిస్టులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఇప్పటికే ఈ విషయమై ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న కళాకారులు భారీ సంఖ్యలో ఈ సాయంత్రం మాటీవీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అందుబాటులో ఉన్న రాళ్ళతో అక్కడున్న కార్లు, ఆఫీసు అద్దాలపై దాడికి దిగారు. మహిళా నటులు కూడా ఆ దాడిలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News