: డ్వాక్రా రుణ పరిమితి పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాం: కేటీఆర్


'బంగారు తల్లి' బకాయిలను వెంటనే చెల్లిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు చెప్పారు. డ్వాక్వా రుణ పరిమితిని రూ.5 నుంచి 10 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. వడ్డీ లేని రుణాల విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు కేటీఆర్ సూచించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమంపై ఇవాళ ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్త్రీ నిధి బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.98 లక్షల డివిడెండ్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. పంచాయతీ వ్యవస్థ అధ్యయనానికి త్వరలో కేరళ, కర్ణాటకల్లో పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News