: 1931లో పోస్టు చేస్తే ఇప్పుడు చేరిందా ఉత్తరం!


విదేశాల్లోనూ పోస్టల్ శాఖ నిర్వాకాలు విస్తుగొలుపుతున్నాయి. ఎప్పుడో 1931లో పోస్టు చేసిన ఉత్తరాన్ని 83 తర్వాత బట్వాడా చేశారు. అమెరికాలో 1931లో మిరియమ్ మెక్ మైకేల్ (23) అనే యువతి తన తల్లి డొలేనా మెక్ మైకేల్ కు తొమ్మిది పేజీల సుదీర్ఘ లేఖ రాసింది. దాన్ని పోస్టు చేసి అంతటితో ఊరుకుంది. ఏళ్ళు గడిచిపోయాయి, తరాలు మారాయి. కానీ, ఆ ఉత్తరం మాత్రం చేరవలసిన గమ్యం చేరకుండానే పోస్టాఫీసులోనే మగ్గిపోయింది.
అయితే, ఇటీవలే పిట్స్ ఫీల్డ్ లోని పోస్టాఫీసు ఉద్యోగి మిచెల్లీ రోవెల్ కు ఈ లేఖ కంటపడింది. దానిపై రెండు సెంట్ల విలువ చేసే స్టాంపు అంటించి ఉంది. పోస్టు మాస్టర్, ఇతర పట్టణ అధికారులు అతికష్టమ్మీద ఆ కవర్ పై ఉన్న చిరునామాను వెతికి పట్టుకోగలిగారు. ఇప్పుడా ఉత్తరాన్ని మిరియమ్ మేనకోడలు ఆన్ మెక్ మైకేల్ (69)కి అందించి బరువు దించుకున్నారు. విచారించాల్సిన విషయం ఏమిటంటే... ఆ ఉత్తరం రాసిన వ్యక్తి, తీసుకోవాల్సిన వ్యక్తి ఇద్దరూ ఇప్పుడు భూమ్మీద లేకపోవడమే!

  • Loading...

More Telugu News