: అగస్టా వెస్ట్ లాండ్ కేసులో బీవీ వాంఛూను ప్రశ్నిస్తున్న సీబీఐ
అగస్టా వెస్ట్ లాండ్ కేసులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీవీ వాంఛూను సీబీఐ ప్రశ్నిస్తోంది. ప్రధాని, మాజీ ప్రధానమంత్రులకు భద్రత కల్పించే ఎస్ పీజీ విభాగానికి వాంఛూ అధిపతిగా పనిచేశారు. ఆ సమయంలో హెలికాప్టర్ల ఎంపిక విషయంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన గోవా గవర్నరుగా పనిచేస్తున్నారు. 2012లో గోవా గవర్నరుగా నియమితులైన వాంఛూ పదవీకాలం 2017తో ముగుస్తుంది. అయితే సీబీఐ విచారించిన నేపథ్యంలో ఆయన గవర్నరు పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వినవస్తున్నాయి.