: ప్రజలే మా పత్రిక, మా ఛానల్ : ముఖ్యమంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే పత్రికలు, ఛానల్ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తమ గురించి ఎవరూ ప్రత్యేకంగా ప్రచారం చేయనక్కర్లేదన్నారు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగు రోజుల కిందట జరిగిన ఈవ్ టీజింగ్ ఘటనను ఖండించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. మనుషుల్లో మానవత్వం, గౌరవం, మహిళల పట్ల అభిమానం ఉండాలన్నారు. కాగా, జులై చివరి వారంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.