: ఇరాక్ లో భారత నర్సులకు విముక్తి!
నెలరోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. ఇరాక్ లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నిర్బంధంలో ఉన్న 46 మంది భారత నర్సులకు విముక్తి కలిగింది. ఈ కేరళ నర్సులను తిక్రిత్ నుంచి మోసుల్ పట్టణానికి తరలించిన మిలిటెంట్లు అక్కడ వారిని విడుదల చేసినట్టు సమాచారం. వారు నేడు ఎర్బిల్ విమానాశ్రయానికి చేరుకుంటారని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. కాగా, నర్సులను తీసుకువచ్చేందుకు ఢిల్లీ నుంచి ఈ సాయంత్రం ఓ ప్రత్యేక విమానం ఎర్బిల్ పయనం కానుందని తెలుస్తోంది.