: భారత్ రానున్న క్లింటన్


అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈనెలలో భారత్ రానున్నారు. లక్నో, జైపూర్ నగరాల్లో జరిగే పలు సదస్సులలో ఆయన పాల్గొంటారు. ప్రపంచాన్ని వేధిస్తున్న పలు సమస్యలపై, ముఖ్యంగా, ఆరోగ్యం, వాతావరణ మార్పులు, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై క్లింటన్ మాట్లాడతారు. కాగా, జూలై 16 నుంచి సాగే ప్రపంచ పర్యటనలో భాగంగా క్లింటన్ భారత్ తో పాటు వియత్నాం, ఇండోనేసియా, ఆస్ట్రేలియా, పపువాన్యూగినియా వంటి దేశాలను సందర్శిస్తారు. ఆయా దేశాల్లో క్లింటన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారు. భారత్ లో చేపడతున్న అక్షయపాత్ర పథకాన్ని ఆయన సమీక్షిస్తారు. అక్షయపాత్ర పథకం ద్వారా లక్షలాది పిల్లలకు ఆహారం అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News