: గుంటూరు జిల్లాలో చిట్టీల పేరుతో రెండు కోట్లకు మోసం


చిట్టీల పేరుతో కోట్లకు కోట్లు మోసం చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో మితిమీరుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా బాపట్లలోని రైలుపేటలో నాంచారమ్మ అనే మహిళ రూ.2 కోట్లకు మోసం చేసింది. నగదు కావాలంటూ అడిగిన వారికి ఆరు నెలలుగా ఇస్తానంటూనే వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఆమె డబ్బుతో ఉడాయించడంతో అసలు వ్యవహారం బయటపడింది. దాంతో, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News