: టీవీ చానల్ కెక్కిన జయలలిత చెల్లెలు!
తాను తమిళనాడు సీఎం జయలలిత చెల్లెలినంటూ సుమారు అరవయ్యేళ్ళ శైలజ అనే మహిళ కన్నడనాట టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. జయలలిత తన అక్క అని చెప్పారు. సంధ్యారాణి, జయరామన్ దంపతులకు తాము ముగ్గురం సంతానం అని వెల్లడించారు. జయలలిత పెద్దదని, తాను, జయకుమార్ మిగిలిన సంతానం అని శైలజ పేర్కొన్నారు. అయితే, తాను గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడని, చిన్ననాటే తాను కళాకారుడు దామోదర్ పిళ్ళైకి దత్తపుత్రికగా వెళ్ళిపోయానని తెలిపారు.
ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్న విషయం అక్క జయలలితకు తెలుసని, ఆమె భోగభాగ్యాలతో ఉంటే తాను పేదరికంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తొలి నుంచి తాను నిరాదరణకు గురయ్యానని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, శైలజ ఇంటర్వ్యూపై జయలలిత స్పందన తెలియరాలేదు.